![]() |
సినిమా అనేది ఎంతో ప్రభావవంతమైన మాధ్యమం అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో నెగెటివ్‌గా కావచ్చు, పాజిటివ్‌గా కావచ్చు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయనే వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఒక సినిమా వల్ల కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడడం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారిన విషయం. అసలేం జరిగింది? ఆ సినిమాకి, ఆ పెళ్ల్లిళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపుýర్ అయిన ‘దేవదాసు’ కథ గురించి అందరికీ తెలిసిందే. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన ఈ నవల మొదటిసారి 1917లో పబ్లిష్ అయింది. ఈ కథ ఆధారంగా 1935 నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో 20 సినిమాలు రూపొందాయి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘దేవదాసు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చివరిసారిగా 2002లో షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో హిందీలో ‘దేవ్‌దాస్’ పేరుతో ఈ కథ తెరపైకి వచ్చింది.
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవ్‌దాస్’ చిత్రం షూటింగ్ 2001లో ప్రారంభించారు. ఆరోజుల్లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్‌గా ద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని చంద్రముఖి పాత్రకు సంబంధించిన కోట సెట్‌ను ఎంతో భారీగా నిర్మించారు. దాదాపు కిలోమీటరు మేర ఈ సెట్ ఉంటుంది. ఆరోజుల్లో ఆ సెట్‌ను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ఆ సెట్ ఎఫెక్టివ్‌గా కనిపించేందుకు 2,500 పవర్‌ఫుల్ లైట్స్‌ను ఏర్పాటు చేశారు. వాటి కోసం పెద్ద మొత్తంలో జనరేటర్స్ తెప్పించారు. ముంబాయిలో ఉన్న జనరేటర్స్ అన్నీ ‘దేవ్‌దాస్’ సెట్‌లోనే ఉన్నాయని చెప్ప్పుకున్నారు. దాదాపు 30 రోజుల పాటు ఆ సెట్‌లో షూటింగ్ జరిగింది. అది పెళ్లిళ్ల సీజన్. చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడ లైటింగ్ కోసం జనరేటర్స్ అవసరం అయ్యాయి. కానీ, అవన్నీ ‘దేవ్‌దాస్’ షూటింగ్‌లో ఉండిపోయాయి. దాంతో ఆ నెలలో కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయని అప్పట్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘దేవ్‌దాస్’ 2002 జూలై 12న విడుదలై ఘనవిజయం సాధించింది. దాదాపు 168 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సష్టించింది. మొదట 2002 మే 23న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ‘దేవ్‌దాస్’ చిత్రానికి ప్రశంసలు లభించాయి.
![]() |